Tuesday, May 13, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఊట, నాటు సారాయి స్వాధీనం కేసు నమోదు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

ఊట, నాటు సారాయి స్వాధీనం కేసు నమోదు.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి

విశాలాంధ్ర -ధర్మవరం; ఎక్సైజ్ చంద్రమణి ఆధ్వర్యంలో సిబ్బంది చెప్పిన దాడులలో మండలములోని నేలకోట గ్రామానికి చెందిన లక్ష్మీనాయకు వద్ద 4 లీటర్ల ఊట రెండు లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకొని అరెస్టు చేయడం జరిగిందని ఎక్సైజ్ సీఐ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత వారం రోజులుగా నాటు సారా నిర్మూలన కార్యక్రమం నవోదయ 2.0 కార్యక్రమంలో భాగంగా జరిపిన ఎక్సైజ్ దాడులలో 62 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని తొమ్మిది మంది నాటు సారా ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా 790 లీటర్ల ఉటాను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. తదుపరి టిసిఎస్ సభ్యులతో సమావేశం జరిపి కళ్ళు అంగళ్లు గురించి సూచనలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు