సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్యయాదవ్
విశాలాంధ్ర ధర్మవరం: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఈనెల 18వ తేదీన ఖమ్మం లో నిర్వహిస్తున్నామని, ఈ మహాసభకు 5 లక్షల మంది దాకా సిపిఐ కార్యకర్తలు పాల్గొంటారని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ధర్మవరం పట్టణంలో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భవించి 100 సంవత్సరాలుపూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ ఖమ్మం జిల్లాలో ఖమ్మంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని దీన్ని జయప్రదం కోరుతూ శ్రీ సత్య సాయి జిల్లా వ్యాప్తంగా సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈనెల 17 తారీఖున ధర్మవరం నుంచి ఖమ్మం కు సిపిఐ ప్రత్యేక రైలు ఏర్పాటు చేసిందని, కావున ప్రతి కార్యకర్త చలో ఖమ్మం రావాలని పిలుపునిచ్చారు. ఈ శతాబ్ద కాలంలో సిపిఐ ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు ,ఎంతో మంది అమరువీరుల రక్త తర్పణంతో ఎన్నెన్నో విజయాలు సాధించి, భారత దేశ రాజకీయ చరిత్రలో సిపిఐ తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నదని భూమి కోసం, భుక్తి కోసం, నిరంకుశ నిజామును గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో మూడు వేల గ్రామాల విముక్తి 10 లక్షల ఎకరాల భూమిని పంచిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ది అని తెలిపారు. ఫలితంగానే పాలకులు భూ సంస్కరణ చట్టం గరీబీ హటావో బ్యాంకుల జాతీయ కర్ణ అనే సంస్కరణలు చేయాల్సి వచ్చింది అన్నారు. పోరాటాల ద్వారా దేశంలోనే అనేక కార్మిక సంక్షేమ చట్టాలను సాధించింది అని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ యూపీఏ ప్రభుత్వంలో చరిత్రత్మక సమాచార హక్కు చట్టం, ఉపాధి హామీ పథకం అటవీ హక్కుల చట్టం తీసుకురావడానికి సిపిఐ కృషి చేసిందనీ పేర్కొన్నారు. కావున చలో ఖమ్మం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల రాష్ట్ర అధ్యక్షులు జింక చలపతి, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు, సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వెంకట నారాయణ, వెంకట స్వామి, శీలా నారాయణ స్వామి, చేతి వృత్తిదారుల సంఘం పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి శ్రీనివాస్, శ్రీధర్, మహిళా సమైక్య నాయకులు లలితమ్మ, లింగమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 18 న చలో ఖమ్మం జయప్రదం చేయండి
- Advertisement -
RELATED ARTICLES


