Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి

సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలి

- Advertisement -

కరెస్పాండెంట్ నరేంద్రబాబు
విశాలాంధ్ర ధర్మవరం;; సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించాలని కరెస్పాండెంట్ నరేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణములోని సాయి నగర్లో గల సూర్య హై స్కూల్ నందు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీల్లో హైస్కూల్ విద్యార్థులు అందరూ పాల్గొన్నారు. అనంతరం నరేంద్రబాబు సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం పోటీలో మొదటి విజేతగా ఎస్ . రుప్పుస పదవ తరగతి, రెండవ విజేతగా చైత్ర, యామిని, అంజనీ తేజ, గోపిక.. వీరు ఎనిమిదవ తరగతి వారు, మూడవ విజేతగా మెహర్, వర్షిత, వర్షిని.. 9వ తరగతి విద్యార్థులు విజయదలుగా నిలిచారు. వీరందరికీ కరస్పాండెంట్ చేతులు మీదుగా బహుమతులను అందజేశారు. అనంతరం విద్యార్థులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు