Homeజిల్లాలుఅనంతపురంరైతుల సమస్యలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి: సిపిఐ నేత డి.జగదీష్...

రైతుల సమస్యలపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి: సిపిఐ నేత డి.జగదీష్…

- Advertisement -

విశాలాంధ్ర–గుత్తి: ఈ నెల 28, 29, 30 తేదీల్లో కడపలో నిర్వహించనున్న సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డి. జగదీష్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం గుత్తి పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సీపీఐ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి. జగదీష్‌ మాట్లాడుతూ.. ఈ నెల 29న కడపలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్యతో పాటు రాష్ట్ర నాయకత్వం హాజరవుతుందని చెప్పారు.29, 30 తేదీల్లో జరిగే రాష్ట్ర ప్లీనరీ సమావేశాల్లో రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతుల సమస్యలు, ప్రజా సమస్యలతో పాటు జాతీయస్థాయిలో ఎన్నికల వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషన్‌ వ్యవహారశైలిపై తమ పార్టీ అభ్యంతరాలను సమావేశంలో చర్చించి, తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో పెద్ద సంఖ్యలో పేర్లు డ్రాఫ్ట్‌ జాబితాల నుంచి తొలగించబడుతున్నాయని వివిధ రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అధికారిక సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 2026 జూలైలో విడుదలైన డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాలో సుమారు 44.89 లక్షల పేర్లు మృతులు, శాశ్వతంగా తరలివెళ్లిన వారు, గైర్హాజరు, డూప్లికేట్‌ తదితర కేటగిరీల కింద తొలగించబడ్డాయి.సూపర్‌ ఎల్‌నినో ప్రభావంతో అనంతపురం జిల్లాలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డి. జగదీష్‌ అన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రైతులకు అవసరమైన సహాయ, ఉపశమన చర్యలను వెంటనే ప్రకటించాలని కోరారు.గుత్తి–గుంతకల్‌ జాతీయ రహదారి–67 పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డి. జగదీష్‌ ప్రభుత్వాన్ని కోరారు. రహదారి పనులు పూర్తయితే ఈ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం తగ్గి, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.ఈ సమావేశంలో సీపీఐ నాయకులు రమేష్‌బాబు, రామదాసు, రాజు యాదవ్‌, నజీర్‌, వెంకటరాముడు, మధుసూదన్‌, టి.ఎం. బాషా, రామకృష్ణ, బెస్త శివకుమార్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు