ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల కబడ్డీ జట్టు స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై 37-33 పాయింట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపుతో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టు తమ టైటిల్‌ను విజయవంతంగా నిలబెట్టుకుంది.మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు హోరాహోరీగా సాగింది. ద్వితీయార్థంలో ఒక దశలో 36-31 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, ఇరాన్ గట్టి పోటీ ఇచ్చింది. అయితే, చివరి నిమిషాల్లో భారత అమ్మాయిలు ఒత్తిడిని అధిగమించి కీలక పాయింట్లు సాధించారు. ఫైనల్ విజిల్ మోగేసరికి నాలుగు పాయింట్ల ఆధిక్యంతో స్వర్ణాన్ని ఖాయం చేసుకున్నారు.ఈ విజయంతో భారత పతకాల సంఖ్య 27కి (3 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్యాలు) చేరింది. ఈరోజు దేశానికి అందిన నాలుగో పతకం ఇది. ఇక, కాసేపట్లో జరగనున్న పురుషుల కబడ్డీ ఫైనల్లో కూడా భారత జట్టే ఇరాన్‌తో తలపడనుండటంతో క్రీడాభిమానుల్లో ఆసక్తి రెట్టింపైంది.
ఆసియా క్రీడలు: కబడ్డీలో అమ్మాయిల సత్తా.. భారత్ ఖాతాలో మరో గోల్డ్
- Advertisement -
RELATED ARTICLES


