Homeతెలంగాణతెలంగాణలో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టులు.. కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం

తెలంగాణలో 200 కొత్త జూనియర్ సివిల్ కోర్టులు.. కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యం

- Advertisement -

ష్ట్రంలో న్యాయవ్యవస్థను బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసుల భారాన్ని తగ్గించి, ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో తొలి విడతలో 200 కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయ వ్యవహారాల కార్యదర్శి బి. పాపిరెడ్డి ఈ నెల 24న జీవో ఎంఎస్ నెం.59 జారీ చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 594 కొత్త కోర్టులు ఏర్పాటు చేయాలని తెలంగాణ హైకోర్టు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం, ఆర్థిక శాఖ ఆమోదంతో మొదటి దశలో 200 కోర్టులను మంజూరు చేసింది. కక్షిదారులకు కోర్టులను మరింత చేరువ చేయడం, ప్రస్తుతం ఉన్న న్యాయమూర్తులపై పని భారాన్ని తగ్గించడం దీని ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం తన ఉత్తర్వులలో స్పష్టం చేసింది.

కొత్తగా మంజూరైన కోర్టులలో అత్యధికంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలోనే 71 కోర్టులు ఏర్పాటు కానున్నాయి. ఇందులో రంగారెడ్డి జిల్లాకు 30, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు 25, హైదరాబాద్ జిల్లాకు 16 కోర్టులు కేటాయించారు. ఇతర జిల్లాలైన నల్గొండకు 10, సంగారెడ్డి, ఖమ్మంలకు చెరో ఎనిమిది చొప్పున కోర్టులు మంజూరయ్యాయి.

2025 జూన్ నాటికి రాష్ట్రంలోని జిల్లా కోర్టులలో సుమారు 9.38 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కోర్టుల ఏర్పాటు కేసుల విచారణను వేగవంతం చేస్తుందని అధికారులు ఆశిస్తున్నారు. అయితే, ఇది కేవలం కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ఉత్తర్వు మాత్రమే. సిబ్బంది నియామకం, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే ఈ కోర్టులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు