Homeఆంధ్రప్రదేశ్స్థానిక ఎన్నికలకు ఏపీ రెడీ.. హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు!

స్థానిక ఎన్నికలకు ఏపీ రెడీ.. హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూపులు!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది.మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు.ఇందులో భాగంగా 41 యూఎల్‌బీలకు సంబంధించి వార్డు వారీ ఓటర్ల జాబితాల ప్రక్రియను ఇప్పటికే చేపట్టారు.

రిజర్వేషన్లపై ఇంకా స్పష్టత రావాల్సిందే..
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తైంది.ఈ కేసుల్లో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తీర్పు వెలువడిన అనంతరం ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాలను అధికారులు తీసుకోనున్నారు.

బ్యాలెట్ బాక్సుల ఏర్పాట్లు
మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.అవసరమైతే అదనపు బ్యాలెట్ బాక్సులను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.మున్సిపల్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.మున్సిపల్ ఎన్నికలు పూర్తైన తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించే అవకాశం ఉంది.పంచాయతీ ఎన్నికలను కూడా రెండు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

హైకోర్టు తీర్పు తర్వాత వేగం పెంచే అవకాశం
ప్రస్తుతం అధికారులు డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియలపై ప్రధానంగా దృష్టి సారించారు.హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు