Homeజిల్లాలుఅనంతపురంతప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి

తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి

- Advertisement -

డీఎంహెచ్ఓ.డా. ఈ బి. దేవి


విశాలాంధ్ర- అనంతపురం టౌన్: సాధారణ కాన్పు సాధ్యం కాని సందర్భంలో సిజేరియన్ చేయాలని అలా అని సిజేరియన్ అవసరం లేని కాన్పులకు సిజేరియన్ చేయడం సరైనది కాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి దేవి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలో గత నెలలో జరిగిన మాతృ శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్లూరు మండల పరిధిలో పసాల సరస్వతి అనే మహిళ కాన్పు సందర్భంగా మరణించడంపై విచారణ చేస్తూ సంబంధిత వైద్యులు సిబ్బందిపై మండిపడ్డారు. ఆ మహిళకు సకాలంలో సిజరిన్ చేసి ఉండవలసినదని విశ్లేషించారు. మృతురాలి కుటుంబ సభ్యులు సిజరిన్ వద్దన్నారని అందువల్ల తాము చేయలేకపోయామని సంబంధిత డాక్టర్ చెప్పడం పట్ల అభ్యంతరము వ్యక్తం చేశారు. పరిస్థితు లకు అనుగుణంగా కాన్పులు జరపాలని తద్వారా మాతృ మరణాలు నివారించాలని, కుటుంబ సభ్యులకుసకాలంలో అవగాహన కల్పించ వలసిన బాధ్యత వైద్య సిబ్బందిపై ఉందని జిల్లా వైద్యాధికారి పేర్కొన్నారు. అవగాహన కల్పించకపోయిన మహిళా సూపర్వైజర్, ఆరోగ్య కార్యకర్త, ఆశలకు మెమోలు జారీ చేయాలని ఆమె ఆదేశించారు. మహిళా కాన్పు విషయంలో సిజేరియన్ అవసరమైన సందర్భంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన తాడిపత్రిలోని నిహార ఆసుపత్రికి నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా గత నెల రోజులుగా జరిగిన ఆరు శిశు మరణాలపై కూడా సమీక్ష నిర్వహించి భవిష్యత్తులో జరగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ.డాక్టర్. శేషు భూషణ్ రెడ్డి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి గైనకాలజీ విభాగం వైద్యులు డాక్టర్ రేణుక, చిన్నపిల్లల విభాగం వైద్యులు డాక్టర్ దినకర్,లోకనాథ్, అనస్థీషియా విభాగం డాక్టర్ సోమశేఖర్, అలాగే డిఎంహెచ్వో కార్యాలయ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి,డాక్టర్ విష్ణుమూర్తి, డిపిహెచ్ఎన్ఓ ప్రమీల, హేమలత, డిప్యూటీ డెమో లక్ష్మీనారాయణ, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు