Homeజిల్లాలుఅనంతపురంటెండర్లు పిలవకుండా గవిమఠం పనులు: కోలేగుండ్ల శేఖర్

టెండర్లు పిలవకుండా గవిమఠం పనులు: కోలేగుండ్ల శేఖర్

- Advertisement -

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం): అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఉన్న గవి మఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో చేపడుతున్న తాత్కాలిక అభివృద్ధి పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించకుండా గుట్టు చప్పుడు కాకుండా వారికి కావలసిన వ్యక్తులకి అప్పగించారని ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కోల్లెగుండ్ల శేఖర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్లను ఆహ్వానించకుండా పనులు ఎలా చేపట్టారని అసిస్టెంట్ కమిషనర్ ప్రశ్నించినప్పటికీ ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. చలువ పందిళ్ళు ఏర్పాటు పనులను ఏకపక్షంగా అప్పగించడం వెనక ఆంతర్యం ఏమిటో బహిర్గతం చేయాలని శేఖర్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు