తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలకు అవకాశం ఉందని ఎన్ జి ఆర్ ఐ శాస్త్రవేత్త డా. శేఖర్ అంచనా హెచ్చరించారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని సూచించారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందన్నారు. రిక్టర్ స్కేలుపై 6 లోపు ప్రమాదాలు జరగవని, మన దగ్గర ఈ ముప్పు లేదని శేఖర్ తెలిపారు. ప్రస్తుతం వచ్చిన భూకంపం తీవ్రత 5.3 గా ఉందని , ఇక రాబోయే రోజులు అంత తీవ్రత ఉందని చెప్పారు.. ఇక హైదరాబాద్ జోన్ 2 పరిధిలో ఉండటంతో భూ కంప ప్రభావం చాలా స్వల్పంగా మాత్రమే ఉంటుందన్నారు.
మళ్లీ భూకంపం వచ్చే అవకాశం: హెచ్చరించిన శాస్త్రవేత్తలు
RELATED ARTICLES