ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన వాహన శ్రేణిని భారీగా తగ్గించుకున్నారు. తన కాన్వాయ్‌లో ఉండే 12 వాహనాలను కేవలం 4 వాహనాలకు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తీసుకొచ్చిన ఆయన, ఈరోజు ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు. గురువారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం చంద్రబాబు కేవలం నాలుగు వాహనాల కాన్వాయ్‌తోనే బయలుదేరారు. ఇకపై తన ప్రయాణాలన్నింటికీ ఈ కుదించిన కాన్వాయ్‌నే వినియోగించాలని ఆయన నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా తమ వాహన శ్రేణిని తగ్గించుకుని ఇంధనాన్ని ఆదా చేయాలని, తద్వారా ప్రజాధనం వృథాను అరికట్టాలని సూచించారు. ముఖ్యమంత్రి సూచనతో పలువురు మంత్రులు కూడా తమ కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నట్లు సమాచారం.
కేవలం 4 వాహనాల కాన్వాయ్ తో సచివాలయానికి వచ్చిన చంద్రబాబు
- Advertisement -
RELATED ARTICLES


