ఏపీలో ఈరోజు నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేడు ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష . ఇవాళ్టి ఎగ్జామ్ కోసం సెట్-2 ప్రశ్నపత్రం ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17 వరకు ఇంటర్ పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఇక, ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. ఇక, తొలి రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి ద్వితీయ భాషపై పరీక్ష జరగనుంది. కాగా, ఇంట ర్మీడియట్ రెండు సంవత్సరాల విద్యార్థులకు ఒక రోజు తప్పించి మరో రోజు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టులు పెట్టారు. ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు! పిల్లలందరూ ధైర్యంగా ఉండాలి. ఏకాగ్రతతో పరీక్షలు రాయండి. మీ వంతు కృషి చేయండి. మీపై నమ్మకం ఉంచండిు అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
ప్రారంభమైన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్.. ఆల్ ది బెస్ట్ చెప్పిన చంద్రబాబు
RELATED ARTICLES