Thursday, February 27, 2025
Homeజిల్లాలుకర్నూలుచీటర్ కమ్మరి పరమేష్ అరెస్టు చేయాలి

చీటర్ కమ్మరి పరమేష్ అరెస్టు చేయాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : చీటింగ్, నకిలీ ఫోర్జరీ, ఫేక్ పట్టాలు క్రియేట్ చేసి ఇచ్చి మళ్ళీ బాధితున్నే బెదిరిస్తూ దౌర్జన్యం చేస్తున్న కేసులో నిందితుడైన సిపిఎం జిల్లా రైతు సంఘం ఉపాధ్యక్షులు అని చెప్పుకుంటున్న కమ్మరి పరమేశును ఎస్సై నిరంజన్ రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాలని బాధితుడు బోయ నరసింహులు డిమాండ్ చేశాడు. గురువారం బోయ నరసింహులు పోలీసు పోలీస్ స్టేషన్ ముందు నిల్చుని విలేకరులతో మాట్లాడుతూ నకిలీ పట్టాలు ఇచ్చి తన దగ్గర 2. 80 లక్షల రూపాయలు నగదు తీసుకొని నా కుటుంబ సభ్యుల నలుగురి పేర్లపై నాలుగు నకిలీ ఇంటి పట్టాలు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ఇచ్చాడని తెలిపారు. సర్వేనెంబర్ 377 నందు ,సదరు పట్టాలకు స్థలం చూపి హద్దులు వేయండి అని స్థానిక మండల రెవెన్యూ తాసిల్దార్ కార్యాలయం అధికారులను కోరగా నా పట్టాలు పరిశీలించిన రెవెన్యూ అధికారులు సర్వేనెంబర్ 377 చెరువు అని చెరువుకు పట్టాలు ఎవరిచ్చారు అని పైగా ఇవి నకిలీ ఫోర్జరీ పట్టాలని తేల్చారన్నారు. పట్టాలు ఇచ్చిన కమ్మరి పరమేష్ దగ్గరకు వెళ్లి అడగగా పట్టాలు నకిలీవని ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని నీకు నా స్థలంలో ఐదు సెంట్లు స్థలం ఇస్తానని ఒప్పుకొని ఇవ్వకుండగా పైగా నన్నే ఎస్సై గారి దగ్గరికి పిలిపించి బూతులు తిట్టించడమే కాకుండా నన్ను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కమ్మరి పరమేశ్ పై,17 -02-2025 న జిల్లా ఎస్పీ గవఫిర్యాదు చేయడం జరిగిందని, ఎస్పీ ఆదేశాలతో ఎస్సై కమ్మరి పరమేష్ పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. కేసు నెంబర్15/2025 సెక్షన్ 318(2),336(3),340(2)351(2) కేసు నమోదు కాబడిన కమ్మరి పరమేష్ కనీసం స్టేషన్ పిలిపించడం గాని, దండించడం కానీ జరగలేదని తెలిపారు. దీనికి కారణం కమ్మరి పరమేష్ కు ఎస్సై సపోర్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం అన్నారు. నిందితుడు పరమేష్ శిక్షించాల్సింది పోయి ఆయనకే వంతపడడం ఎస్సై నిరంజన్ రెడ్డి గారి స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమిటో అర్థం కావడం లేదన్నారు. కూలి పని చేసుకుని రెక్కల కష్టంతో బ్రతికే నన్ను 2 లక్షల 80 వేల రూపాయలు నగదు తీసుకొని మోసం చేసి నకిలీ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు ఇచ్చిన కమ్మరి పరమేష్ ను అరెస్టు చేసి నాకు న్యాయం చేయాలని కమ్మర్ పరమేష్ చేతిలో నాలాగా మోసపోయిన బాధితులు మండలంలో వందల మంది ఉన్నారని తెలిపారు. నకిలీ ఫోర్జరీ సంతకాలు పట్టాలు ఇచ్చి వందలాది మందిని మోసం చేసిన కమ్మరి పరమేష్ కు స్టేషన్ బెల్ ఇవ్వకూడదని, పైగా ఎస్సై నిరంజన్ రెడ్డి నేరుగా హైకోర్టుకు వెళ్లి క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకో అని నిందితుడికి చెప్పడంలో అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. చీటర్, బ్లాక్ మెయిలర్ అయిన పరమేష్ శిక్షించాల్సింది పోయి రక్షించాల్సిన ప్రయత్నం చేయడం దుర్మార్గమని, న్యాయదేవతకు కల్లుగప్పి న్యాయాన్ని సమాధి చేయడం ఎస్సై నిరంజన్ రెడ్డికే చెల్లిందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు