Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచీటింగ్ కేసు నమోదు

చీటింగ్ కేసు నమోదు

- Advertisement -

విశాలాంధ్ర,కదిరి.నలుగురు వ్యక్తులపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ డివి నారాయణ రెడ్డి తెలిపారు.గురువారం సీఐ తన కార్యాలయంలో మాట్లాడుతూ యర్రగుంటపల్లి గ్రామము వద్ద జగనన్న కాలనీలో ఇళ్ల పట్టాలు ఇప్పిస్తామంటూ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్జుగుట్ట రాజశేఖర్ రెడ్డి,రఘునాథరెడ్డి, మంజునాథ,ఈశ్వరయ్య నలుగురు కలిసి జగనన్న కాలనీలో ఒకటిన్నర సెంటు ప్రభుత్వ స్థలం ఇంటి పట్టా ఇప్పిస్తామని తమ వద్ద నుండి రూ.75 వేల రూపాయలు డబ్బులు తీసుకొని మోసం చేసారంటూ కుటాగుళ్ల గ్రామానికి చెందిన జంగాల లక్ష్మి,భర్త జంగాల నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురిపై చీటింగ్ కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. తనతో పాటు మరి కొందరి వద్ద సుమారు రూ.4,80,000- రూపాయలు తీసుకొని వారు ఎటువంటి పట్టాలు ఇప్పించకుండా మోసం చేశారని,ఆ విషయం గురించి అడిగితే అంతు చూస్తామని బెదిరిస్తున్నారని బాధితులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు