Wednesday, December 4, 2024
Homeజిల్లాలుఅనంతపురంఅసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు డ్రోన్లతో చెక్ పెట్టండి

అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు డ్రోన్లతో చెక్ పెట్టండి

— జిల్లా ఎస్పీ పి.జగదీష్
విశాలాంధ్ర- అనంతపురం : అసాంఘిక కార్యకలాపాల కట్టడి, నేరాల నియంత్రణకు డ్రోన్లతో చెక్ పెట్టాలని జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల నుండీ డ్రోన్లు ఆపరేటింగు కోసం ప్రత్యేకంగా 30 మంది పోలీసు సిబ్బందిని కేటాయించారు. వీరందరికీ స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో డ్రోన్లు ఆపరేటింగ్ పై మంగళవారం శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…ప్రధానంగా నగరం,మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల శివార్లలో ఓపెన్ డ్రింకింగ్ చేసి న్యూసెన్స్ క్రియేట్ చేయడం… పేకాట ఆడటం, గంజాయి సేవించడం, అమ్మాయిలను ఈవ్ టీజ్ చేయడం, ఒంటరిగా వెళ్లే మహిళలు కావచ్చు లేదా వ్యక్తులునైనా బెదిరించడం, చోరీలకు పాల్పడటం, చైన్ స్నాచింగ్ చేసి పరారవ్వడం… ఇలా నేరాలకు పాల్పడేవారికి డ్రోన్లతో చెక్ పెట్టవచ్చన్నారు. 3 కిలోమీటర్ల పరిధిలోని ప్రదేశాలను కవర్ చేస్తూ ఆ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, నేరాల విజువల్స్ డ్రోన్లలో సేవ్ అవుతాయన్నారు. అంతేకాకుండా…. ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు జరిగే సమయంలో డ్రోన్లు బాగా దోహదపడుతాయన్నారు. ప్రముఖుల బందోబస్తు, అధికంగా జనం గుమిగూడే కార్యక్రమాలలో కూడా నేరస్తులపై నిఘా వేయవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యాలలో భాగంగా వరదలు, తదితర సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు మరియు ప్రజలను రక్షించేందుకు ఇవి ఉపయోగపడుతాయన్నారు. కొన్ని సందర్భాలలో పోలీసులు భౌతికంగా వెళ్లలేని ప్రదేశాలకు డ్రోన్లను పంపి అక్కడి పరిస్థితులను సమీక్షించుకునే వీలుంటుందన్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం శివారు ప్రాంతాలలో 3 డ్రోన్లను ఎగుర వేస్తున్నామని… త్వరలోనే జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధుల్లో డ్రోన్లు ఎగురవేసేలా విస్తరింపు చేస్తామన్నారు. జిల్లా ఎస్పీ తో పాటు అదనపు ఎస్పీలు రమణమూర్తి, ఇలియాజ్ బాషా, సైబర్ విభాగం సి.ఐ షేక్ జాకీర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు