విశాలాంధ్ర –తాడేపల్లిగూడెం : శ్రీ వాసవి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలో శనివారం విద్యార్థుల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే వేడుక కార్యక్రమం ఉల్లాసంగా ఉత్సాహంగా యువత నిర్వహించిన క్లాసికల్,మాస్, సినీ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి అనంతరం జరిగిన సభ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ అధ్యక్ష వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల చైర్మన్ ఎన్ వి రమణారావు మాట్లాడుతూ నేటి యువత దేశానికి వెన్నుముక లాంటి వారు అన్నారు, క్రీడలు సాంస్కృతికతోపాటు విద్యలో నైపుణ్య అభివృద్ధి సాధించి దేశ అభివృద్ధిలో యువత ప్రధాన పాత్ర పోషించాలన్నారు కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయాలు కానగుణంగా విద్యలో రాణించి ఉన్నత ఉద్యోగ అవకాశాలు సాధించాలని అన్నారు యువత చదువుతోపాటు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు.ఎంతో ఉత్సాహంతో ఫ్రెషర్స్ డే లో పాల్గొన్న విద్యార్థినీ విద్యార్థులు కు శుభాకాంక్షలు తెలియజేశారు వాసవి విద్య సంస్థలలో చదివిన విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలు అవరోధించాలని కోరారు తమ కళాశాలలో ప్రతిభ విజ్ఞానం కలిగిన అధ్యాపకులు మన ఉన్నారని వారు అందిస్తున్న విద్యావనరలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని కోరారు సమయాన్ని వృధా చేయకుండా, అన్ని సబ్జెక్టుల్లో నైపుణ్యం సాధించాలని కోరారు విద్యార్థినీ విద్యార్థులు అందరూ సోదరభావంతో కలిగి ఉండాలన్నారు, ప్రతి విద్యార్థి ర్యాగింగ్ అనే భూతానికి దూరంగా ఉండాలన్నారు, క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఎంచుకున్న రంగంలో పట్టు సాధించవచ్చు అన్నారు అనంతరం జూనియర్స్ కు సీనియర్స్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ మండ బ్రహ్మాజీ ,ట్రెజరర్ నున్న సుందరం ,వైస్ ప్రెసిడెంట్ పెనుగొండ వెంకటేశ్వరరావు కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
ఉల్లాసంగా…ఉత్సాహంగా.. ఫ్రెషర్స్ వేడుక
- Advertisement -
RELATED ARTICLES


