కార్యదర్శి గంగాధర్, జుజారు నాగరాజు
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రజాహిత పాలనకు మార్గదర్శకుడు శంభాజీ మహారాజ్ అని చత్రపతి శివాజీ మహారాజ్ కమిటీ అధ్యక్షుడు హరి, కార్యదర్శులు గంగాధర్, జూజారు నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబానీ భవాని ఆలయంలో ఘనంగా శంభాజీ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. తొలుత పేరిటన అంబా భవాని కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శివాజీ మరాఠా రాజ్యానికి 9 సంవత్సరాలు చత్రపతిగా పరిపాలించాడని తెలిపారు. ఆయన వారసత్వాన్ని గౌరవించడానికి ఊరేగింపులు, మతపరమైన సమావేశాలు సాంస్కృతిక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. హైందవ ధర్మ పరిరక్షణ, పరమత సహనం, వెన్ను చూపని వీరత్వం, శౌర్య పరాక్రమాలకు ఎదురులేని మహనీయుడు శంభాజీ మహారాజ్ అని తెలిపారు.ఈ కార్యక్రమంలో సభ్యులు పెద్ద వెంకటేష్, సరోదేభుజంగరావు, కామలే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాహిత పాలనకు మార్గదర్శకుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్..
RELATED ARTICLES