విశాలాంధ్ర ధర్మవరం : బాల్యవివాహం అనేది ఒక సాంఘిక దురాచారమని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రజా పరిషత్ లోని గ్రామ సచివాలయ సిబ్బంది మండల స్థాయి అధికారులు కు బాల్య వివాహ పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో సాయి మనోహర్ పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీవో మాట్లాడుతూ బాల్య వివాహం వల్ల జరిగే నష్టాలు, అనారోగ్యం, కుటుంబ జీవన విధానం పలు విషయాలను తెలియజేశారు. ధర్మవరం ప్రాంతంలో బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాల్సిన బాధ్యత అధికారుల ది, సిబ్బందితేనని వారు స్పష్టం చేశారు. అనంతరం అందరి చేత బాల్య వివాహాల నివారణ పై ప్రతిజ్ఞ చేయించారు. ఎక్కడైనా బాల్య వివాహ ప్రయత్నాలు జరిగిన చైల్డ్ లైన్ హెల్ప్ లైన్-1098 కు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించాలని తెలిపారు. అప్పుడు బాల్యవివాహాలను ఆపే అవకాశం ఉంటుందని తెలిపారు. బాలికల విద్య సాధికారత పై దృష్టి పెట్టి, ధర్మవరాన్ని బాల్య వివాహ రహితత్వార్ధంగా తీర్చిదిద్దడంలో అందరి యొక్క సహాయ సహకారాలు కృషి ఎంతైనా అవసరమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
బాల్య వివాహం ఒక సాంఘిక దురాచారం ఎంపీడీవో సాయి మనోహర్
RELATED ARTICLES