Monday, April 21, 2025
Homeఆంధ్రప్రదేశ్అణ్వస్త్రాలకు బదులుగా చైనా హైడ్రోజన్ బాంబు.. పరీక్ష విజయవంతం

అణ్వస్త్రాలకు బదులుగా చైనా హైడ్రోజన్ బాంబు.. పరీక్ష విజయవంతం

అణుబాంబు తీవ్ర విధ్వంసం సృష్టిస్తుంది. అంతేకాదు, ఆ తర్వాత కొన్ని దశాబ్దాలపాటు దాని దుష్ఫలితాలను ప్రజలు అనుభవించాల్సి ఉంటుంది. అయితే, అణుబాంబు అంతటి విధ్వంసం సృష్టిస్తూనే, రేడియేషన్ వంటి తదనంతర దుష్పరిణామాలు లేని ఓ సరికొత్త బాంబును చైనా అభివృద్ధి చేసింది. అదే హైడ్రోజన్ బాంబు. తాజాగా దీనిని విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే ఇలాంటి బాంబులు అమెరికా, రష్యాల వద్దనునున్నాయి. తాజాగా ఆ జాబితాలో ఇప్పుడు చైనా చేరింది. హైడ్రోజన్ బాంబు 1000 డిగ్రీలకుపైగా వేడిని వెలువరిస్తూ కొన్ని సెకన్లపాటు అగ్నిగోళంలో మండుతుంది. దీంతో తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. ఆ వేడికి కొన్ని లోహాలు కూడా కరిగిపోతాయి. రక్షణ పరికరాలు, సామగ్రి దెబ్బతింటాయి. చైనా చేసిన ఈ ప్రయోగ వివరాలను సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్్ణ పత్రిక ప్రచురించింది. చైనా షిప్‌ బిల్డింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 705 రిసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌్ణ ఈ హైడ్రోజన్‌ బాంబు పరీక్షను నిర్వహించినట్టు పేర్కొంది. రెండు కిలోల మెగ్నీషియం హైడ్రైడ్‌ వినియోగించిన పేలుడు పరికరాన్ని నియంత్రిత పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో పరీక్షించినట్టు వెల్లడించింది. పేలుడు సమయంలో రెండు సెకన్ల పాటు 1000 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతతో కూడిన అగ్నిగోళం ఏర్పడిందని, అది సంప్రదాయ టీఎన్‌టీ (ట్రై నైట్రో టోలిన్‌) పేలుడు కంటే 15 రెట్లు ఎక్కువని వివరించింది. నిజానికి మెగ్నీషియం హైడ్రైడ్‌ను వివిధ రంగాల్లో శక్తి ఉత్పాదన కోసం వినియోగించేందుకు అభివృద్ధి చేశారు. ఈ పదార్థాన్ని వేడి చేసినప్పుడు హైడ్రోజన్‌ను విడుదల చేస్తుంది. దాన్ని ఇంధనంగా కూడా వినియోగిస్తారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు