ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న హీరో చిరంజీవి. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన కొణిదెల శివ శంకర వరప్రసాద్.. చిరంజీవిగా తన స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు. నటుడిగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలతో ఎందరికో ఆదర్శంగా నిలిచారు. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి విశేష సేవలను అందిస్తున్న చిరుకి అరుదైన గౌరవం దక్కింది. చిరంజీవికి ఁలైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ కల్చరల్ లీడర్‌షిప్ఁ అవార్డుతో సత్కరించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 19న యూకే పార్లమెంట్‌లో చిరు ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. గతేడాది కేంద్ర రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవి.. ఇప్పటికే ఎన్నో అరుదైన అవార్డులు అందుకున్నారు. ఇప్పుడు యూకే ప్రభుత్వం నుంచి మరో అరుదైన ఘనతను అందుకోబోతున్నారు.
చిరంజీవికి యూకే పార్లమెంటులో అరుదైన గౌరవం
RELATED ARTICLES