- Advertisement -
విశాలాంధ్ర – తాళ్లపూడి : ప్రజలంతా ఎంతో భక్తి తో చేసుకునే వినాయక చవితికి పూజా సమయం లో ఎటువంటి పొల్యూషన్ పెరగని మట్టి ప్రతిమలనే వినియోగించాలని పర్యావరణ ప్రేమికుడు గణపతి ప్రతిమను స్వంతంగా చేసుకునే ఓ యువకుడు శివ తెలిపారు. ఈయన 15 ఏళ్లుగా చవితి మండపం లో వినియోగించుకునే విధంగా ఎత్తైన విగ్రహాన్ని మట్టి తో తయారు చేసి బహుకరిస్తుంటాడు. ఈ ఏడాది మూడు విగ్రహాలను వేర్వేరు రూపాల్లో తయారు చేసి ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపారు. కేవలం పర్యావరణాన్ని కాపాడండి అనే విధానం ప్రజలకు తెలియ చేయటానికే ఈ ప్రయత్నం అని, తన స్నేహితులు డివివి తదితరులు ప్రేరణ ప్రోత్సహం అని తెలిపారు.


