విశాలాంధ్ర బ్యూరో -నెల్లూరు: నెల్లూరు 53 వ డివిజన్ వెంకటేశ్వర పురం సెంటర్ లో డివిజన్ ఇన్ చార్జ్,వెంగళరెడ్డి కోఆర్డినేటర్పరంధామయ్య ల ఆధ్వర్యంలోరచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమా లు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికివైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరైపార్టీ నేతలకు డివిజన్ స్థాయి కమిటీలపై అవగాహనా కల్పించికమిటీలను త్వరగా పూర్తిచేయాలనిసూచించారు.అనంతరంకోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమాన్ని గురించి ప్రజలకు వివరించారు.పలు దుకాణాలకుఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసిపి నేతలతో కలిసివెళ్ళి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినకోటి సంతకాల సేకరణ ఉద్యమకార్యచరణను ప్రజలకువివరించిప్రజలనుంచి సంతకాలు స్వీకరించారు.
ఈ సందర్బంగాపర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిమాట్లాడుతూ..
53 డివిజన్ లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ నేతలుఉత్సాహంగానిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. మొదటి నుంచి నెల్లూరు నగర నియోజకవర్గంలో 53,54 డివిజన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకికంచుకోటలాంటివన్నారు. మీ ఇంటి బిడ్డ లాగా ప్రజలందరికీ సేవలు అందిస్తానని తెలిపారు.
వైఎస్ఆర్ సీపీని బలోపేతం చేసిఈ రాష్ట్రంలో మళ్లీ జగన్మోహన్రెడ్డినిముఖ్యమంత్రినిచేసుకోవడమేలక్ష్యమన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకి, గౌరవం, విలువ దక్కేల జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కళాశాలలను..చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తూ..అమ్ముకుంటు సొమ్ము చేసుకుంటున్నాడని అన్నారు.
పేద వారి కోసంతీసుకువచ్చిన మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం కాకూడదనే లక్ష్యంతోనే జగన్మోహన్ రెడ్డి . కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికిపిలుపునిచ్చారని తెలిపారు. ఇది అహంకారానికి. పేదవాడి ఆత్మగౌరవానికి జరుగుతున్న యుద్దామన్నారు. జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు.
కోటి సంతకాల సేకరణకు.. ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన చూస్తుంటే.. మెడికల్ కళాశాలలు ప్రైవేట్ పరం చేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కితీసుకోకతప్పదున్నారు.నెల్లూరునగరనియోజకవర్గంలో 60 వేల సంతకాలు టార్గెట్ గా పెట్టుకుంటే ఈ రోజు లక్ష సంతకాలకుదాటే పరిస్థితి కనిపిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పెర్నాటి కోటేశ్వర రెడ్డి, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయ కృష్ణారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జున, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదెళ్ల కిషన్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు ఆశ్రీత్ రెడ్డి, ఐ టి విభాగం నగర అధ్యక్షులు ప్రసన్నకుమార్, అంగన్వాడి విభాగం అధ్యక్షురాలు రమీజా, నగర మున్సిపల్ విభాగం అధ్యక్షురాలు సూరి నాగేశ్వరి, నగర దివ్యాంగుల విభాగం అధ్యక్షులు షేక్ సుబహాన్, 53,54 వైసీపీ నేతలు పాల్గొన్నారు.
వెంకటేశ్వర పురం సెంటర్ లో కోటి సంతకాల సేకరణ
- Advertisement -


