విశాలాంతర ధర్మవరం; పట్టణంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోతుకుంట గ్రామ సచివాలయమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే ప్రజలకు నిర్లక్ష్యం లేకుండా సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అనంతరం హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్, వివిధ పథకాలకు సంబంధించిన రికార్డులను వారు పరిశీలించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, ఎమ్మార్వో సురేష్ బాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ శ్యాంప్రసాద్:: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం కార్యాలయ సిబ్బందితో రెవెన్యూ అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలను ఇవ్వడం జరిగింది. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు దరఖాస్తుల పెండింగ్ ఉండరాదని తెలిపారు, ప్రజలకు సేవలు వేగవంతం చేయాలని అందుకు దిశా నిర్దేశం కూడా తెలపడం జరిగిందని వారు తెలిపారు. ప్రజల నుండి విశ్వాసం పెంచేలా అధికారులంతా బాధ్యతాయుతంగా పనిచేయాలని తెలిపారు. ప్రతి సోమవారము జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎప్పటికప్పుడు ప్రజలకు న్యాయం చేయాలని తెలిపారు. రెవెన్యూ అంశాల్లో జాబ్ ఏం జరగకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, తాసిల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్;; పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తనిఖీ చేశారు. అనంతరం వారు రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి ఈవీఎం ఏర్పాట్లపై వారు ఆరా తీశారు. రాజకీయ పార్టీల సమక్షంలో గోడౌన్ లోపల బద్దపరిచిన ఎన్నికల సామాగ్రిని భద్రతా చర్యలను కలెక్టర్ చిన్నంగా పరిశీలించారు. వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్, తాహసిల్దార్ సురేష్ బాబు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్;! పట్టణంలోని ఆర్డీవో కార్యాలయాన్ని కూడా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకాష్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను వారు పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై పలు విషయాలను, వాళ్ళు సూచనలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్ ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపే బాధ్యత అధికారులదేనని, అందుకు సిబ్బంది కూడా తప్పనిసరిగా సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెవెన్యూ డివిజన్ కార్యాలయానికి మంచి గుర్తింపు వచ్చేలా అందరూ సమన్వయంతో పని చేయాలని తెలిపారు. రెవెన్యూ సేవలో జాప్యం జరగకుండా ప్రభుత్వం నిర్దేశించిన గడువుల్లోనే అన్ని పనులు పూర్తి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్ డివిజనల్ పరిపాలన అధికారి కతిజున్ కుప్రా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


