ఎంపీడీవో సాయి మనోహర్
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని 14 పంచాయితీలలో పెన్షన్దారులకు డిసెంబర్ 31వ తేదీనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొత్తం 14 గ్రామపంచాయతీలలో 6,726 మంది పెన్షన్ దారులకు రూ. 2కోట్ల 97 లక్షల 69 వేల రూపాయలను పెన్షన్ దారులకు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పెన్షన్ తీసుకునేవారు ఎవరూ కూడా అధికారులకు, సిబ్బంది కి లంచం ఇవ్వరాదని తెలిపారు. అలా ఎవరైనా అడిగినచో మాకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఒకే రోజున పెన్షన్లు ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. కావున పెన్షన్ దారులు తమ ఇంటి వద్దనే ఉండి పెన్షన్ ఇచ్చు సిబ్బందికి సహకరించాలని తెలిపారు.
డిసెంబర్ 31వ తేదీనే గ్రామాలలో పెన్షన్ పంపిణీ
- Advertisement -
RELATED ARTICLES


