క్రీడలు: భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తో పాక్ క్రికెటర్ బాబర్ అజాం ను పోల్చడం సరికాదు అని టీం ఇండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అన్నారు. పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ స్టేజీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ విఫలమయ్యాడు ఏడువంతులను ఎదుర్కొని అతడు కేవలం ఐదు పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ నేపథ్యంలో దినేశ్ కార్తీక్ స్పందించాడు. బాబర్ షార్ట్ సెలక్షన్ పాలవంగా ఉంటుందని అతడు విశ్లేషించాడు. “చాలా కాలంగా బాబర్ ను విరాట్ కోహ్లీ తో పోల్చుతున్నారు. అది చాలా అన్యాయం. బాబర్ లా… కోహ్లీ నిర్లక్ష్యంగా షాట్లు ఆడడం నేను చూడలేదు” అని దినేష్ కార్తీక్ అన్నాడు. జట్టును గెలిపిస్తాడన్న నమ్మకం నాకు బాబర్ లో కనిపించలేదని, అతడు పరుగులు రాబట్టలేకపోయాడన్నాడు. ఒత్తిడిలో రాణించడమే గొప్ప క్రికెట్ లక్షణం అని, నాకు బాబర్ లో అటువంటి ఆత్మవిశ్వాసం కనిపించలేదన్నాడు. అత్యుత్తమ క్రికెటర్ అనిపించుకునే లక్షణాలు నేను అతడిలో గుర్తించలేదు. అభిషేక్ శర్మ ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అని నేను భావిస్తున్నా అని దినేష్ కార్తీక్ అన్నాడు.
కోహ్లీతో బాబర్ ను పోల్చడం సరికాదు : దినేశ్ కార్తీక్
- Advertisement -
RELATED ARTICLES


