Homeజిల్లాలుకర్నూలుపని హక్కు పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం

పని హక్కు పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఉపాధి హామీ పథకంలో భాగంగా పని హక్కు పరిరక్షణే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు స్పష్టం చేశారు. మంగళవారం పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి కోడుమూరు మండలం గార్గేయపురంలో నిర్వహిస్తున్న “ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర”లో పాల్గొనేందుకు పెద్దకడబూరు మండలం నుంచి నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకానికి మహాత్మాగాంధీ పేరును కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పని హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని బలోపేతం చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే తమ ధ్యేయమని, కేంద్రంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచే వరకు పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. రైతుల పక్షాన నిలబడే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి బారుసబ్బు అంజినయ్య, మండల మాజీ అధ్యక్షులు నాగరాజు, ఐఎన్‌టీయూసీ తాలూకా నాయకులు ఫిలిప్, ఐఎన్‌టీయూసీ నాయకులు చిన్నతుంబలం నరసప్ప, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు