Homeజిల్లాలుకర్నూలువైభవంగా శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం

వైభవంగా శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు : గ్రామమంతా భక్తిరసంతో నిండిపోయేలా పెద్దకడబూరు గ్రామంలో వెలసిన శ్రీ సిద్ధారూఢ స్వామి రథోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా అశేష భక్తజన సమూహం నడుమ రమణీయంగా జరిగింది. ఈ మహోత్సవం ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సంతరించుకుంది. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. స్వామివారికి ఆకుపూజ, కుంకుమార్చన, బిల్వార్చన, పంచామృతాభిషేకం నిర్వహించగా వేదమంత్రోచ్చారణల మధ్య భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయం ప్రాంగణం భక్తులతో కిటకిటలాడినది. మధ్యాహ్నం ఆలయ కమిటీ పెద్దలు సత్యనారాయణరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జగన్నాథ రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా చేపట్టారు. ఆలయం నుండి రథం వరకు మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథం భక్తుల కళ్లకు కనువిందు చేసింది. సాయంత్రం ఉత్సవమూర్తిని కలశాలతో, మంగళ వాయిద్యాల నడమ రథం వద్దకు ఘనంగా తీసుకువచ్చారు. చిన్నారుల కోలాటాలతో ఉత్సవానికి ప్రత్యేక శోభను తీసుకువచ్చారు. భక్తి భావంతో భక్తులు స్వామివారి రథానికి మొక్కుబడిగా రెండు రుద్రాక్ష గజమాలలను సమర్పించి విశేష భక్తిని చాటుకున్నారు. మాజీ వీఆర్వో రామలింగారెడ్డి ఇంటి నుండి స్వామివారి పూర్ణకుంభాన్ని మంగళవాయిద్యాలతో రథం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని రథంపై ప్రతిష్ఠించి అశేష భక్తవాహిణి నడుమ రథోత్సవం అత్యంత భక్తిపూర్వకంగా కొనసాగింది. భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారి నామస్మరణతో ఆధ్యాత్మికోత్సాహాన్ని వ్యక్తపరిచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి రథోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
పలువురు నాయకుల ప్రత్యేక పూజలు
శ్రీ సిద్దారూఢా స్వామి రథోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి, మాజీ ఎంపీపీ నరవ శశిరేఖ, మంత్రాలయం టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి తనయులు టీడీపీ యువనేతలు రాకేష్ రెడ్డి, రాజారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యనిర్వాహక మండల సభ్యులు పురుషోత్తం రెడ్డి, ఎంపీపీ శ్రీవిద్య, వైసీపీ మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, వైసీపీ బూత్ తాలూకా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీపీ రఘురామ్, వైసీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి శివరామరెడ్డి, వైసీపీ యువజన విభాగం తాలూకా అధ్యక్షులు నరవ రాజశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు లక్ష్మీనారాయణ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి అనుచరులు టీడీపీ నాయకులు టీడీపీ నాయకులు భరద్వాజ్, ఇంద్రసేనారెడ్డి, నీలకంఠ రెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
గట్టి పోలీసు బందోబస్తు
శ్రీ సిద్దారూఢా స్వామి రథోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కోసిగి సీఐ మంజునాథ్, ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి, ఎస్‌ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ మధ్య కార్యక్రమాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయేంద్రరెడ్డి, సొసైటీ ఛైర్మన్ తలారి మీ సేవ ఆంజనేయులు, టీడీపీ బీసీ సాధికార రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, టీడీపీ నాయకులు తలారి అంజీ, పెద్ద హనుమంతు, గుమ్మల ఆశన్న, మంచోది ఆదాం, వైసీపీ ప్రచార విభాగం తాలూకా అధ్యక్షులు ముక్కరన్న, వైసీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బొగ్గుల అర్లప్ప, నాయకులు కొరవ సుందరం, సుక్క కుమార్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు