Homeజిల్లాలుఅనంతపురంచదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

చదువుకున్న పాఠశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

- Advertisement -

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు అయినా మాజీ సర్పంచ్ గోవిందు, మరియు తిప్పేస్వామి వారు చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం ముందుకు వచ్చారు. మంగళవారం పదివేల రూపాయలు ఆర్థిక సహాయం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎర్రిస్వామికి అందజేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ, తాము విద్యను అభ్యసించిన ఈ పాఠశాల తమ జీవితాల్లో కీలక పాత్ర పోషించిందని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు సహకరించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల సహకారం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని, వారి సేవాభావాన్ని అభినందించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు