వెల్జర్ల సర్పంచ్ ఆర్. బాబు నాయక్
ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్గా ఎన్నికైన జాంగారి రవికి ఘన సన్మానం
వెల్జర్లలో ఘనంగా అభినందించిన గ్రామ నాయకులు, ప్రజలు
విశాలాంధ్ర-షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ చైర్మన్గా ఎన్నికైన వెల్జర్ల గ్రామానికి చెందిన యువ నాయకుడు జాంగారి రవిని గ్రామ సర్పంచ్ రాత్లావత్ బాబు నాయక్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఎస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జాంగారి జంగయ్య, మాజీ ఉప సర్పంచ్ కావాలి జగన్ మాట్లాడుతూ…. వెల్జర్ల గ్రామానికి చెందిన జాంగారి రవి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం నియోజకవర్గ చైర్మన్గా ఎన్నిక కావడం గ్రామానికి గర్వకారణమన్నారు. రవి మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
షాద్నగర్ నియోజకవర్గంలో దళితుల అభివృద్ధి, వారి సమస్యల పరిష్కారం, సంక్షేమం కోసం జాంగారి రవి అంకితభావంతో పనిచేయాలని వారు సూచించారు. దళితుల హక్కులు, సమస్యలపై నిరంతరం పోరాడుతూ వారికి అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ దొడల వెంకటేష్ యాదవ్, షాద్నగర్ సింగిల్ విండో డైరెక్టర్ పాత్లావత్ దాస్య నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటికేల తిరుపతి యాదవ్, మండల కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అనిమి అఖిల్ గౌడ్, కావాలి బాల నర్సింహులు, కావాలి కెవిఎం, వట్టెల మహేష్ యాదవ్, దొడల శ్రీనివాస్ యాదవ్, కావాలి యాదయ్య, తుప్పరి రమేష్, మందడి వినయ్ గౌడ్, గ్రామ నాయకులు అనిమి శివరాజ్ గౌడ్, తెలంగాణ ఉద్యమకారుల సంఘం మండల అధ్యక్షుడు దొడ్డి రవీందర్, కావాలి జంగయ్య, గ్రామ వార్డు సభ్యులు వట్టెల ప్రవళిక మహేష్ యాదవ్, దొడ్డి లక్ష్మీ రవీందర్, కావలి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


