Homeతెలంగాణకలెక్టర్‌కు దీపావళి శుభాకాంక్షలు

కలెక్టర్‌కు దీపావళి శుభాకాంక్షలు

- Advertisement -

విశాలాంధ్ర బ్యూరో, మేడ్చ‌ల్‌-మ‌ల్కాజిగిరి : జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మను చౌదరిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, జిల్లా అభివృద్ధి, ప్రజాసేవలో అధికారులు మరింత సమర్థవంతంగా పని చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు, జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి జి.వినోద్ కుమార్, కార్యదర్శి కురుమూర్తి, ఉపాధ్యక్షులు సాంబశివరావు (డిఆర్‌డిఓ), రవీందర్, కిషన్ నాయక్, క్రీడా కార్యదర్శి హరికృష్ణ, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ డి.ఎం.సుగుణ భాయి, జిల్లా ఉపాధికల్పన అధికారి రాధిక, సిఈఓ కాంతమ్మ, డిటిఓ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ స్వర్ణలత, ఏఎస్‌డ‌బ్ల్యుఓ గోపి చంద్ తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు