Homeజిల్లాలుఅనంతపురంమానవత్వం చాటుకున్న ఎంపీపీ స్వాతిలతా రెడ్డి..

మానవత్వం చాటుకున్న ఎంపీపీ స్వాతిలతా రెడ్డి..

- Advertisement -

వికలాంగులతో కలిసి కింద కూర్చొని ఆప్యాయంగా పలకరించిన ఎంపీపీ స్వాతిలతా రెడ్డి

విశాలాంధ్ర – నార్పల ( అనంతపురం జిల్లా ): మండలంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ స్వాతిలతా రెడ్డి వికలాంగులతో కలిసి కింద కూర్చొని, వారిని ఆప్యాయంగా పలకరిస్తూ కొంతసేపు ఆత్మీయంగా గడిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.హోదాను పక్కనపెట్టి వారితో సమానంగా కింద కూర్చొని మాట్లాడటం ద్వారా తనలోని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్యజీవితంలో ఎదురవుతున్న ఇబ్బందులను ఓపికగా వింటూ వారి కష్టాలను తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా స్వాతిలతా రెడ్డి మాట్లాడుతూ. వికలాంగుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, వారి సమస్యల పరిష్కారానికి మానవతా దృక్పథంతో ముందుకు రావాలని అన్నారు. వికలాంగులను గౌరవించడం, వారి ఇబ్బందులను అర్థం చేసుకోవడం, వారికి తోడుగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.హోదా, అంతస్తులను పక్కనపెట్టి వారితో కలిసి కింద కూర్చొని ఆప్యాయంగా మాట్లాడిన స్వాతిలతా రెడ్డి చూపిన ప్రేమాభిమానాలు, మానవత్వం పలువురి ప్రశంసలు అందుకున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు