విశాలాంధ్ర- ధర్మవరం : నేషనల్ టొబాకో కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా టొబాకో ఫ్రీ యూత్ క్యాంప్ 4.0 ను నిర్వహించినట్లు డాక్టర్ ప్రియాంక తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపేట యూ.పీ.హెచ్. సి. ధర్మవరం నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పొగాకు వాడడం వల్ల వచ్చే అనర్థాలను గురించి వివరించడం జరిగింది అని తెలిపారు. పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల పొగతాగే అలవాటు ఉన్నవారు, పొగ త్రాగని వారి కంటే పది సంవత్సరాలు ముందే మరణిస్తారని, పొగాకు తాగినప్పుడు ఊపిరితిత్తులలో ప్రవేశించి ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటికి క్యాన్సరు, స్వర పేటిక, గొంతు క్యాన్సర్, మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు, గర్భ సమస్యలు, పిల్లల్లో పుట్టుకతోనే శరీర లోపాలు మొదలైనవి జరుగుతాయని పొగాకు అలవాటు కాదు అది నిశ్శబ్ద ప్రమాదమని, పొగాకు వాడకం తగ్గేది కాదు పూర్తిగా మానితేనే క్యాన్సర్ నుండి గెలుపు వస్తుంది,ఒక మంచి నిర్ణయం పొగాకు గుడ్ బై ఆరోగ్యానికి పునాది అని తెలిపారు.ప్రజలందరి చేత భవిష్యత్తులో పొగాకు ఉత్పత్తులను ఉపయోగించమని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులను గాని , సమాజంలో ఇతర వ్యక్తులను గాని పొగాకు ఉత్పత్తులను వాడకుండా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. తరువాత కొత్తపేట బాయ్స్ హై స్కూల్ నందు పిల్లలకు కూడా టాబాకో పై అవగాహన కల్పించటం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పొగాకు నియంత్రణ అధికారి శమంతకమణి, మలేరియా హెల్త్ అసిస్టెంట్ మోహన్ కుమార్,,సి.మారుతీ ,యూ.పీ.హెచ్.సి. స్టాఫ్ , ఏ.యన్.యమ్స్ ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.
నేషనల్ టోబాకొ కంట్రోల్ ప్రోగ్రామ్ లో టోబాకొ ఫ్రీ యూత్ క్యాంపు 4.O… డాక్టర్ ప్రియాంక
- Advertisement -
RELATED ARTICLES


