విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ సర్పంచ్ బరిలో టీడీపీ సీనియర్ నాయకుడు సైదం వెంకటేష్ (ఫోటోస్టాట్ వెంకటేష్) తన అభ్యర్థిత్వాన్ని పరిశీలనలోకి తీసుకువస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి నిబద్ధతతో పనిచేస్తూ, పయ్యావుల సోదరులకు నమ్మకంగా ఉంటూ వారి రాజకీయ ప్రస్థానంలో భాగస్వామిగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా మంత్రి పయ్యావుల కేశవ్ విజయానికి నిరంతరం కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించారు. చేనేత కార్మికులు, పేదల సంక్షేమం కోసం పోరాడటంతో పాటు, ఫుట్‌పాత్ బాధితులకు అండగా నిలిచారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఉచిత ఫోటోస్టాట్ సేవలు అందిస్తూ ఫోటోస్టాట్ వెంకటేష్‌గా గుర్తింపు పొందారు. సర్పంచ్‌గా అవకాశం లభిస్తే ఉరవకొండను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడం, నూతన కూరగాయల మార్కెట్ ఏర్పాటు, ప్రత్యేక పార్కు నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేయాలనే లక్ష్యాలను ప్రకటిస్తున్నారు.


