Homeతెలంగాణతెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి 100 సీట్లు వస్తాయి

తెలంగాణ రాష్ట్రం లో ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కి 100 సీట్లు వస్తాయి

- Advertisement -

విశాలాంధ్ర, జూబ్లీహిల్స్ : మంగళవారం ఇందిరాపార్క్ ధర్నాచౌక్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగేష్ ముదిరాజ్ గారు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పదవి ఊడిపోనుందని మరోసారి ఆ పదవి దక్కించుకునేందుకు సీఎం మెప్పు పొందేందుకే సీఎం భజన చేస్తున్నారని, కనీసం సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం వలన ఈ లాంటి బహిరంగ సభలలో సీఎం ని ఆకాశానికి ఎత్తడం తప్ప, ఏమీ చేయలేని పరిస్థితి మహేష్ గౌడ్ ది అని విమర్శించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసిగి చెంది కెసిఆర్ పాలన కోసం ఎదురుచూస్తున్నారని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించేందుకు గడ్డాలు పెంచుకున్న వారంతారు రేవంత్ రెడ్డిలు కారు అని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభలో వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అని గడ్డం కి సీఎం రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మరి రేవంత్ రెడ్డి కూడా ఎవరిని చూసి గడ్డం పెంచుకున్నాడని ప్రశ్నించారు. కేవలo ప్రజల దృష్టి మరల్చటానికే, గడ్డలు ఫారం హౌస్ మాటలని డైవర్షన్ పాలిటిక్స్ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం నగేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసినందుకు ప్రజాసునామిలో కాంగ్రెస్ నాయకులు కొట్టుకుపోయి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి కెసిఆర్ మూడవసారి సీఎం కావడం తద్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు