Saturday, April 5, 2025
Homeజాతీయంవక్ఫ్‌బిల్లుపై సుప్రీంను ఆశ్రయించనున్న కాంగ్రెస్‌ : జైరామ్‌ రమేష్‌

వక్ఫ్‌బిల్లుపై సుప్రీంను ఆశ్రయించనున్న కాంగ్రెస్‌ : జైరామ్‌ రమేష్‌

వక్ఫ్‌బిల్లుపై రాజ్యసభలో గురువారం వాడివేడి చర్చ జరిగిన అనంతరం.. శుక్రవారం తెల్లవారుజామున ఆమోదం పొందింది. అయితే ఈ వక్ఫ్‌ బిల్లుపై కాంగ్రెస్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ కమ్యూనికేషన్స్‌ ఇన్‌ఛార్జ్‌ జనరల్‌ సెక్రటరీ జైరామ్‌ రమేష్‌ శుక్రవారం వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే సుప్రీంకోర్టులో అనేక చట్టాలపై సవాల్‌ చేసింది. వాటిలో 2019 పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), 2005 సమాచార హక్కు (ఆర్‌టిఐ) చట్టం సవరణలు, ఎన్నికల నిర్వహణ నియమాలు (2024) సవరణలు, ప్రార్థనా స్థలాల చట్టం 1991 వంటి వాటిపై కాంగ్రెస్‌ సుప్రీంలో సవాల్‌ చేసింది. వీటితోపాటుగా వక్ఫ్‌ సవరణ బిల్లు 2024పై కూడా కాంగ్రెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది్ణ అని జైరాం రమేష్‌ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలపై దాడులుగా భావించే మోడీ ప్రభుత్వం చేసే ఏ చర్యలనైనా కాంగ్రెస్‌ ప్రతిఘటిస్తూనే ఉంటుంది ఆయన అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు