విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డులో గల కాలభైరవ స్వామి దేవాలయం ఆవరణములో చలివేంద్రమును కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాత, భర్త కోటిరెడ్డి బాల్రెడ్డి దంపతులు ప్రారంభించారు. తొలుత కాలభైరవ స్వామి ఆలయంలో వారు ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం కోటిరెడ్డి సుజాత కోటిరెడ్డి బాల్రెడ్డిలు మాట్లాడుతూ పట్టణంలో ఎండ వేడిమి అధికంగా ఉన్నందున, ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ఇటువంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. రేగాటిపల్లి రోడ్డులో వందలాదిమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు బాటసారులు వెళుతుంటారని, అటువంటి వారికి ఈ చలివేంద్రం ఏర్పాటు హర్షనీయమని తెలిపారు. చలివేంద్రం ఏర్పాటు నిర్వాహకులకు దంపతులు అభినందించారు.
చలివేంద్రమును ప్రారంభించిన కౌన్సిలర్ కోటిరెడ్డి సుజాత
RELATED ARTICLES