Wednesday, December 4, 2024
Homeజిల్లాలుఅనంతపురంజి జి హెచ్ బాధితులను పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్

జి జి హెచ్ బాధితులను పరామర్శించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్

విశాలాంధ్ర -అనంతపురం : తాడపత్రి నియోజకవర్గం, యాడికి మండలం, వేములపాడు గ్రామంలో నిన్న మధ్యాహ్నం ఘర్షణ జరగడంతో గాయాలైనటువంటి పెద్ద పుల్లారెడ్డి, చిన్న పుల్లారెడ్డి ని సోమవారం రాత్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి నందు ఆర్థో వార్డులో, ఎం ఎస్ -1 వార్డులో చికిత్స పొందడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న సిపిఐ జిల్లా కార్యదర్శి సీ జాఫర్, అనంతపురము నగర కార్యదర్శి ఎన్. శ్రీరాములు, ఏఐటీయూసీ ఆటో యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి జి.దుర్గా ప్రసాద్ చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా సి జాఫర్ మాట్లాడుతూ… ప్రశాంత వాతావరణం ఉన్న గ్రామంలో టిడిపి అధికారంలో వచ్చిన తర్వాత రామచంద్రారెడ్డి వీరి అనుచరులు గుంపులుగా వీరిపైన దాడి చేయడం అమానుషం అన్నారు. పెద్ద పుల్లారెడ్డి పైన బలమైన గాయాలయినాయి, చిన్న పుల్లారెడ్డి తల పైన వెపన్తో దాడి చేసినట్టుగా అర్థమవుతుందిఅన్నారు.
ఈ అంశం పైన సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గ్రామంలో రోడ్డు విస్తరణ అవసరమని భావిస్తే పంచాయతీ సెక్రటరీ ద్వారా జరగాలని అవసరమైతే రెవెన్యూ వారు జోక్యం చేసుకొని పోలీసు వారి సహకారంతో సామరస్య పూర్వకంగా పరిష్కారం చేయాలన్నారు . ఏమీ సంబంధము లేనటువంటి వారు రాంచంద్రారెడ్డి వీరి అనుచరులు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం దుర్మాగారం అని పేర్కొన్నారు . ఈ ఘటన పై భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ అంశం పైన పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా ప్రయత్నం చేయాలన్నారు . దాడి చేసిన వారిపైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ జిల్లా సమితి డిమాండ్ చేస్తుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు