అనంతపురం : భారతదేశవ్యాప్తంగా సిపిఐ జాతీయ సమితి పిలుపు పేరుకు అదానీ అవినీతిపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని, అదేవిధంగా డిమాండ్స్ డే గా ప్రకటిస్తూ అనంతపురము నగర సమితి సిపిఐ కార్యదర్శి ఎన్ శ్రీరాములు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సి. జాఫర్ మాట్లాడుతూ… నరేంద్ర మోడీ బినామీ, ఆర్థిక నేరగాడు అదానీ ప్రపంచవ్యాప్తంగా 6,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు సేకరించి భారతదేశంలో ఐదు రాష్ట్రాలలో 2029 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ 2021 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి 1,750 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చినట్లు ఆధారాలతో అమెరికాలోని ఎఫ్.బి. ఐ , ఎస్. ఈ. సీ లు, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో నివేదిక సమర్పించడం జరిగింది. అదానీ, అధానీ తమ్ముని కుమారుడు సాగర అదానీ, మరొక ఆరు మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. సమన్లు జారీ చేశారు. అయినా సరే పార్లమెంటులో జేపీసీ వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తా ఉంటే బిజెపి ప్రభుత్వం పారిపోతోందన్నారు. అదేవిధంగా మణిపూర్ రాష్ట్రంలో బిజెపి డబల్ ఇంజన్ సర్కార్ ఉంది. కుకీ, మైతీల జాతుల మధ్య మారణకాండ జరుగుతున్నది అని పేర్కొన్నారు.. మణిపూర్ రాష్ట్రంలో 60 వేల మంది శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. 250 మంది మరణించారు .చర్చిలు ,మందిరాలు ధ్వంసం అయినాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మణిపూర్ రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడంలో విఫలమైనారు .అందువలన తక్షణం బిజెపి గద్దె దిగాలని సిపిఐ డిమాండ్ చేస్తోందన్నారు. ఉత్తర ప్రదేశ్ స్తంభాల్లో మత హింసకు పూనుకుంటున్నారు. మసీదు కింద దేవుడు ఉన్నాడని, శివుడు ఉన్నాడని కోర్టులో అర్జీలు పెట్టుకుంటున్నారు. పురాతత్వ శాఖకు మసీదులకు దర్గాలకు నోటీసులు సర్వ్ చేస్తున్నారు దీనివలన మత హింస పెట్రేగిపోతోందన్నారు. ఐదు మంది దాకా ముస్లింలు ప్రాణాలు కోల్పోయారు అని పేర్కొన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. నాడు మందిరాలు, మసీదులు యథాతథంగా ఉంచాలని పీవీ, నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1991లో చట్టం చేశారన్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ కఠినమైన చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. అయినా సరే ఉల్లంఘన జరుగుతున్నది అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి, మద్దతిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పునరాలోచించాలి అని పేర్కొన్నారు. భారతదేశంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత హింసను వ్యతిరేకించాలి మతసామరస్యాన్ని కాపాడుకోవడానికి లౌకికవాదులు, సెక్యులర్ శక్తులు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలుగా చేస్తున్న మూక దాడులను, మత హింసను ముక్తకంఠముతో వ్యతిరేకించాలని సిపిఐ జిల్లా కమ్యూనిస్టు పార్టీ పిలిపిస్తున్నది అన్నారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగ సమస్య తాండవిస్తున్నది అని పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులకు తూట్లు పడుతోందన్నారు . ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా హిందుత్వ పేరుతో విభజన రాజకీయాలకు పూనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర సహాయ కార్యదర్శిలు, బి. రమణయ్య, కె. అల్లిపీర, బంగారు భాష, యువజన నాయకులు మోహన్ కృష్ణ ఆనంద్ మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు..