విశాలాంధ్ర,ఉరవకొండ,ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో బుధవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు మాట్లాడుతూ 2014 నుంచి నిత్యావసర ధరలు నిరంతరం పెరుగుతూ పేదలు, కార్మికులు, రైతులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం మోపుతున్నాయని ఆరోపించారు. బియ్యం, పప్పుధాన్యాలు, వంటనూనె, పాలు, చక్కెర, ఉప్పు ధరలు మండిపోతున్నాయని, కూరగాయల ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను సైతం నియంత్రించాలని డిమాండ్ చేశారు.
నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించడంతో పాటు నల్లబజారు, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరతను అరికట్టాలని కోరారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గన్నే మల్లేష్, హనుమంతు, ఆంజనేయులు, నవీన్‌కుమార్, కాజా, నూర్జహాన్, వన్నూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
ధరల భారాన్ని తగ్గించాలని సిపిఐ ఆందోళన
- Advertisement -


