Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు

- Advertisement -

సామాన్యులకు దూరమవుతున్న నిమ్మకాయలు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కాయగూరల మార్కెట్లో నిమ్మకాయ ధరలు నేడు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు వంటకు అవసరమైన నిమ్మకాయల ను కొనుగోలు చేయలేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు సకాలంలో రాకపోవడం, పంటలు పండక పోవడం వలన, పంట దిగుబడి తక్కువగా ఉన్నందున నిమ్మకాయల ధరలు అధికమవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఈ సందర్భంగా నిమ్మకాయల వ్యాపారి హరికృష్ణ మాట్లాడుతూ మా తాత ముత్తాతల కాలం నుంచి తాము ఈ వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి చేసుకుంటున్నామని, కానీ ఇంత ధర తాము ఎప్పుడో చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మూట ధర పదివేల రూపాయలు పలుకుతోందని, నోరు నిమ్మకాయలు 700 రూపాయలు కొనుగోలు చేసి, ప్రజలకు ఎలా విక్రయించాలో మాకు అర్థం కావడం లేదని తెలిపారు. ప్రస్తుతం తాడిపత్రి నుంచి కొనుగోలు చేస్తున్నామని, మామూలుగా నూరు నిమ్మకాయలు 300 రూపాయలు ధర పలుకుతుందని తెలిపారు. భారీగా నిమ్మకాయల ధరలు పెరగడంతో తాము వ్యాపారస్తులు కూడా ఎంతగానో నష్టపోతున్నామని, జీవనాధారం కూడా కష్టమవుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరము మార్చి నుండి జూన్ వరకు సీజన్ గా ఉంటుందని, నూరు నిమ్మకాయలు 800 రూపాయల వరకు ధర పలుకుతుందని తెలిపారు. తాము కొనుగోలు చేయలేక, విక్రయించలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. వర్షాలు పడితే, నిమ్మకాయ పంటలు అధికంగా పండితే ధరలు మామూలుగా ఉంటాయని తెలిపారు. మొత్తం మీద నిమ్మకాయల ధరలు అధికంగా ఉండటం వల్ల వ్యాపారాలు కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు