Monday, March 31, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికబ్జా చేయడానికి దొంగ పట్టాలు సృష్టించడం దారుణం…

కబ్జా చేయడానికి దొంగ పట్టాలు సృష్టించడం దారుణం…

సిపిఐ నియోజవర్గ కార్యదర్శి ముసుగు మధు
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలో సర్వే నంబర్ 650 -2 లో ప్రభుత్వం ప్లంబర్స్ , ఎలక్ట్రీషియన్స్ కార్మికులకు కేటాయించిన ఫ్లాట్స్ లో కొంతమంది కార్మికులకు దక్కకుండా చేయాలని దొంగ పట్టాలను సృష్టించి మా ఫ్లాట్ లను కబ్జా చేయాలని ప్రయత్నాలు చేయడం దారుణ మనీ సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ వారికి వినతి పత్రాన్ని అనంతరం మధు మాట్లాడుతూ వీటిపైన కార్మిక సంఘంగా గత నెల రోజులు పాటు అనేక ఉద్యమాలతో అక్కడ ఫ్లాట్లు ఉన్నవారు అంత అక్రమ దారులు అని తెలిసింది అని,వారికి తమరు ఇంటి టాక్స్, డోర్ నెంబరు, ఇచ్చే ముందుగా రెవెన్యూ కార్యాలయానికి ఎంక్వైరీ నిర్వహించిన తరువాతే పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కమిషనర్ను కోరడం జరిగింది అన్నారు. అలాగే 650 -2 సర్వే నెంబర్ లో అక్రమంగా కట్టిన కట్టడాలకు, కరెంటు మీటర్లు ఇవ్వకూడదని ధర్మవరం పట్టణంలో కరెంటు ఏఈను కలిసి నంబర్స్ ఎలక్ట్రిషన్, తో కలిసివినతిపత్రం ఇవ్వడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి పూలశెట్టి రవికుమార్, పట్టణ సహాయ కార్యదర్శి, ఎర్రం శెట్టి రమణ, ప్లంబర్స్ అసోసియేషన్ నాయకులు అధ్యక్షులు గోవిందరాజు, కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆంజనేయులు, తాజుద్దీన్, సురేంద్ర,నాగేంద్ర,శ్రీనివాసులు, దాదా పీర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు