స్పాన్సర్ చేసిన జిఎల్ఎన్ స్వీట్స్ యజమాని లడ్డుబాబు
విశాలాంధ్ర- ధర్మవరం; ఆర్ డి టి స్పోర్ట్స్ సెంటర్ ధర్మవరంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇద్దరు అబ్బాయిలకు క్రికెట్ బ్యాటింగ్ గ్లోవ్స్ స్పాన్సర్ చేసిన జి ఎల్ ఎన్ స్వీట్స్ యజమాని లడ్డుబాబు ఇటీవల పూర్తయిన అండర్-12 మండల స్థాయి టోర్నమెంట్‌కు లడ్డూ బాబు ట్రోఫీలను కూడా అందించారు అని క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అండర్-12 టోర్నమెంట్ చివరి ఆటచూస్తున్నప్పుడు లడ్డూ బాబు ఆర్డీటీ ధర్మవరం జట్టు ఆటగాళ్ళు ఎం. రాజా, పి. లోహితాక్షల ప్రదర్శనలకు ముగ్ధుడై, వారికి క్రికెట్ బ్యాటింగ్ గ్లోవ్స్ ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. తాను గతంలో హామీ ఇచ్చినట్లుగా, ధర్మవరంలోని ఆర్‌డిటి స్పోర్ట్స్ సెంటర్‌లో ఎం రాజా , పి. లోహితాక్ష ఇద్దరికీ క్రికెట్ బ్యాటింగ్ గ్లోవ్స్‌ను బహుకరించడం జరిగిందన్నారు. లడ్డు బాబు ఆర్ డి టి సంస్థను అడిటి క్రీడలలో పిల్లల అభివృద్ధి పట్ల చూపుతున్న అంకితభావాన్ని ప్రశంసించారు. పిల్లలకు సహాయం చేయడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అనంతరం కోచ్ రాజశేఖర్ కృతజ్ఞతలను తెలియజేశారు.


