తుపానుగా రూపాంతరం చెందని బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం
ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ వెల్లడి
వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీకి తుపాను ముప్పు లేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈరోజు సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. ఇది గురువారం సాయంత్రానికి శ్రీలంకలోని ట్రింకోమలీకి 200 కి.మీ, నాగపట్టణానికి 340, చెన్నైకి 470, పుదుచ్చేరికి 410 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది.రేపు (శనివారం) ఉదయం కల్లా కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని పేర్కొన్నారు. అయితే, తుపాను ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఈరోజు, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలో ఆకస్మిక వరదలు రావొచ్చని హెచ్చరించింది.
ఏపీకి తప్పిన తుపాను ముప్పు
RELATED ARTICLES