Sunday, December 1, 2024
Homeజాతీయంరాజ్ కుంద్రా నివాసంలో ఈడీ అధికారుల సోదాలు..

రాజ్ కుంద్రా నివాసంలో ఈడీ అధికారుల సోదాలు..

బాలీవుడ్ లో సంచలనం రేకెత్తించిన పోర్న్ రాకెట్ కేసులో అధికారులు మరోమారు సోదాలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పాషెట్టి భర్త రాజ్ కుంద్రా నివాసం, ఆఫీసులలో శుక్రవారం తనిఖీలు చేస్తున్నారు. ఆ కేసుతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులకు సంబంధించిన నివాసాలు, ఆఫీసులపైనా అధికారులు దృష్టిసారించారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ముంబై, ఉత్తరప్రదేశ్ లోని మొత్తం 15 చోట్ల శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. బ్లూ ఫిల్మ్ ల తయారీ, ప్రసారాలలో మనీలాండరింగ్ కోణానికి సంబంధించి ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

కుంద్రాపై నమోదైన కేసు ఇదే..
సినిమా అవకాశాల కోసం ముంబైకి వచ్చే యువతులను కుంద్రా వంచించి బ్లూ ఫిల్మ్ లు తయారు చేశారనేది ప్రధాన ఆరోపణ.. ఈమేరకు 2021లో ముంబై పోలీసులు కుంద్రాపై చార్జిషీట్ దాఖలు చేశారు. ఇలా నిర్మించిన ఫిల్మ్ లను విదేశాలకు ఎగుమతి చేయడంతో పాటు కుంద్రా పలు మొబైల్ యాప్ లలో విడుదల చేశారని చెప్పారు. అనంతరం కుంద్రాను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ కేసులో కుంద్రా నెలల తరబడి జైలులోనే ఉండాల్సి వచ్చింది. కాగా, కుంద్రాపై బిట్ కాయిన్ పోంజీ స్కీమ్ కు సంబంధించిన మరో కేసు కూడా 2017లో నమోదైంది.
Raj సబఅసతీa ూష్ట్రఱశ్రీజూa ూష్ట్రవ్‌్‌వ దీశీశ్రీశ్రీవషశీశీస ూశీతీఅ Rశీషసవ్‌

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు