సైక్లోన్ వర్షాలు దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
విశాలాంధ్ర -కొవ్వూరు: ఈనెల 27,28,29., తేదీలో భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఆర్డిఓ రాణి సుస్మిత అన్నారు. ఆర్టీవో రాణి సుస్మిత శనివారం విలేకరులతో మాట్లాడుతూ అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని మంతా తుఫాన్ 27 28 29 తేదీలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఎవరూ బయటికి వెళ్లకూడదని ఇంట్లోనే ఉండాలని అత్యవసరం అయితే తప్ప ఎవరూ బయటికి రావద్దని రైతులు అప్రమత్తంగా ఉండాలని పిడుగులు పెను గాలులు వీచే అవకాశం ఎక్కువగా ఉందని గోదావరి పరివాహక ప్రజలు ఎవరు గోదావరి స్నానలు చేపలు వేటకు వెళ్లవద్దని మండల గ్రామాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసామని అధికారులు అందుబాటులో ఉంటారని అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని ఆర్టీవో రాణి సుస్మిత తెలిపారు . కొవ్వూరు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 7995367797


