- Advertisement -
విశాలాంధ్ర -కొవ్వూరు : గోష్పాద క్షేత్రంలో ఈనెల 27వ తేదీన జరగనున్న గోదావరి హారతి కార్యక్రమం రద్దయిందని దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఎన్ వి శివరామకృష్ణ తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గోదావరి హారతి కార్యక్రమం మంతా తుఫాన్ కారణంగా రద్దయిందని మరల ఎప్పుడు జరగనున్న విషయం వచ్చే నెల మూడో తారీఖున సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయిస్తామని దాస సాహిత్య ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఎన్.వి శివరామకృష్ణ, కలగర శ్రీనివాసు తెలిపారు.


