భారత సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో ఎస్ఎస్ కార్తికేయ, మరుణ్ గప్తా నిర్మాతలుగా నితిన్ కక్కర్ దర్శకత్వంలో మూవీ రూపొందనుందని బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఇందులో దాదాసాహెబ్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించనున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. అటూ బాలీవుడ్‌లోనూ ఈ బయోపిక్ తెరక్కిస్తున్నట్టు సమాచారం.ఇందులో ఆమిర్ ఖాన్ లీడ్ రోల్ పోషిస్తుండగా..రాజ్ కుమార్ హిరాణిలో దర్శకత్వం వహించనున్నట్టు జోరుగా ప్రచారం జరిగిది. దీంతో ఎవరూ ఈ బయోపిక్ ఇస్తున్నారనేది క్లారిటీ లేదు. ప్రేక్షకులంత ఈ విషయంలో డైలామాలో ఉన్నారు. అయితే తాజాగా దీనిపై ఫాల్కే మనవడు చంద్రశేఖర్ శ్రీకృష్ణ స్పందించారు. బయోపిక్ విషయమై రాజమౌళి కానీ, ఆయన టీం కానీ ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న చంద్రశేఖర్ శ్రీకృష్ణ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌పై మాట్లాడారు. నిరాజమౌళి సమర్పణలో ఈ ప్రాజెక్ట్ రానుందని వస్తున్న వార్తలు నేనూ విన్నాను. కానీ ఆయన కానీ, ఆయన టీం కానీ నాతో ఇప్పటి వరకు మాట్లాడలేదు.
ఫాల్కేపై ఎవరైనా సినిమా తీయాలంటే కనీసం కుటుంబ సభ్యులతోనైనా మాట్లాడాలి. కానీ, ఇంతవరకు ఆయన టీం నన్ను కలవలేదు. కానీ ఆమిర్-రాజ్‌కుమార్ హీరానీ టీం మాత్రం మాతో ఎన్నోసార్లు బయోపిక్ విషయమై మాట్లాడారు. వాళ్ల అసిస్టెంట్ ప్రొడ్యూసర్ నాతో మూడు సంవత్సరాలుగా టచ్‌లో ఉన్నారు. నన్ను ఎన్నోసార్లు కలిశారు. వివరాలు తెలుసుకుననారు. వాళ్లు ఈ ప్రాజెక్ట్ విషయంలో నిజాయితీగా పనిచేస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కేగా ఆమిర్ నటించడం నాకేంతో ఆనందంగా ఉంది. ఆయన ఓ గొప్ప నటుడు, నిబద్ధతో ఉంటారు. వాళ్లు ఈ సినిమా చేయడంతో మాకేలాంటి అభయంతరం లేదుు అని చెప్పుకొచ్చారు.
అయితే ఫాల్కే భార్య విద్యాబాలన్ నటిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారాయన. ప్రస్తుతం ఆయన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారాయి. దీంతో రాజమౌళి ఈ సినిమా చేస్తున్నారా? లేదా? అనే డైలామాకు ఆయన వ్యాఖ్యలతో చెక్ పడినట్టు అయ్యింది. మరి దీనిపై జక్కన్న టీం నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతుంది. నాలుగేళ్లు ఆమిర్ టీం ఈ బయోపిక్ కోసం వర్క్ చేస్తున్నారట. సితారే జమీన్ పర్ విడుదలైన వెంటనే ఫాల్కే బయోపిక్ కోసం ఆమిర్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.