Homeఆంధ్రప్రదేశ్దేవదాసుకు పదోన్నతి

దేవదాసుకు పదోన్నతి

- Advertisement -

సీనియర్ అసిస్టెంట్ దేవదాసుకు పదోన్నతి.

విశాలాంధ్ర – కడియం : కడియం మండల పరిషత్తు సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ దేవదాసు కు డిప్యూటీ ఎంపీడీవో గా పదోన్నతి దక్కింది. ఆయనను రాజనగరం మండలం జి ఎస్ డబ్ల్యూ ఎస్ డిప్యూటీ ఎంపీడీవో గా నియమిస్తూ జిల్లా కలక్టర్ కీర్తి చేకూరి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన గత మూడేళ్లుగా ఇక్కడ సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తూ అందరి మన్ననలను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ఎంపీడీవో కె. రమేష్, మండల పరిషత్ ఏవో సుబ్బారావు, డిప్యూటీ ఎంపీడీవో ఎన్ శ్రీనివాస్, పలువురు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ, పంచాయతీ ఉద్యోగులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు