Friday, February 21, 2025
Homeజిల్లాలుకర్నూలుఎమ్మెల్యే సహకారంతో చిన్నతుంబలంలో అభివృద్ధి పనులు

ఎమ్మెల్యే సహకారంతో చిన్నతుంబలంలో అభివృద్ధి పనులు

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబలం గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సహకారంతో, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ ముత్తమ్మ, ఎంపీటీసీ సభ్యులు బడెమ్మ, మాజీ ఎంపీటీసీ యల్లప్ప ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేపట్టారు. గ్రామ ముఖద్వారం మెయిన్ రోడ్డు నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు రాత్రి సమయంలో ప్రజలు తిరగడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తన సొంత నిధులతో విద్యుత్ స్థంభాలు, వైరింగ్, తదితర వాటిని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మార్చి నెలలో శ్రీ గంగాభవాని రథోత్సవం ఉండడంతో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఆనందం కలిగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కే. పి. యల్లప్ప, నరసింహ మూర్తి, నాయకులు లక్ష్మన్న, సోమప్ప దని, మదిరె రాముడు, బొడ్డన్న, మహాదేవ, కడబూరి, మూకప్ప, భీమన్న, బ్రహ్మయ్య, వెంకటేశ్, నాగేష్, మల్లయ్య, కమ్మరి వీరేష్, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు