–ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
హరీష్ బాబు నేతృత్వంలో ధర్మవరంలో బీజేపీ ర్యాలీ
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలో మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ ద్వారా దేశ భద్రత కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ను ప్రజలకు వివరించి, దేశభక్తి భావాలను ప్రోత్సహించారు. ర్యాలీ సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది అని తెలిపారు. ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడం మా బాధ్యత, అని అన్నారు. అలాగే, దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు సహా పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ర్యాలీ సమయంలో జాతీయ జెండాలు పట్టుకుని జై హింద్, భారత్ మాతా కీ జై వంటి నినాదాలు చేశారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ ప్రజల్లో దేశభక్తి భావాలను రేకెత్తించింది. ర్యాలీ ముగింపు సందర్భంగా హరీష్ బాబు మాట్లాడుతూ, భారత సైన్యం సాహసోపేతంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది అని,
ఈ విజయాన్ని ప్రజలతో పంచుకోవడం మా బాధ్యత, అని అన్నారు. అలాగే, దేశ భద్రత కోసం ప్రతి పౌరుడు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ ద్వారా ధర్మవరం ప్రజలు దేశ భద్రతపై తమ మద్దతును వ్యక్తపరిచారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో దేశభక్తి భావాలను పెంపొందించేందుకు బీజేపీ కృషి చేస్తుందని వారు తెలిపారు.